భారత్ ధర్మసత్రం కాదు: అమిత్ షా వ్యాఖ్యలు
- చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని విమర్శలు
- ప్రతి చొరబాటుదారుడినీ గుర్తించి దేశం నుంచి పంపిస్తామని స్పష్టీకరణ
- ఈ దేశానికి చెందిన వారు మాత్రమే ఇక్కడుంటారని ఉద్ఘాటన
శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ ధర్మసత్రం కాదని, ఈ దేశం పౌరులకు మాత్రమే ఇక్కడ నివసించే హక్కు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుడినీ గుర్తించి, వారిని వెళ్లగొడతామని హెచ్చరించారు. శనివారం మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో మహాలక్ష్మి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా మార్చుకుని రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే ప్రయత్నిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. "ఈ దేశం ధర్మసత్రం కాదని వారికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ దేశానికి చెందిన వారు మాత్రమే ఇక్కడ ఉంటారు. ప్రతి చొరబాటుదారుడినీ గుర్తించి, దేశం నుంచి తరిమికొడతాం" అని ఆయన పేర్కొన్నారు.